ఆచార్య రహస్యం జై శ్రీమన్నారాయణ!మనం ఎప్పుడైనా గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన, ఇది వరకు ఎప్పుడు తట్టని ఒక కొత్త తలంపు, ఇలా దర్శిస్తుంటాము కదా.విష్ణు సహస్ర నామ స్తోత్రంలోని ప్రతి నామము ఆలా ఋషులకు తట్టిందే. వారు శ్రీమన్నారాయణుని పై తీవ్ర ధ్యానంలో ఉన్నప్పుడు తాము దర్శించిన రూపమో, అనుభవించిన గుణమో, విష్ణు నామంగా వెలువడింది. వాటిని వ్యాస మహర్షి వేయి నామాల స్తోత్రముగా చేకూర్చి
Source: JIVA Shamshabad News