Guru Purnima Celebrations at JIVA | HH Chinna Jeeyar Swamiji
అందరికి మార్గదర్శకుడు వ్యాసుడు – శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి గురువులు, ఆచార్యులకే కాదు సమస్త మానవ జాతికి వ్యాస మహర్షి మార్గదర్శకుడు అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు అన్నారు. శంషాబాద్‌లోని దివ్య సాకేత క్షేత్రంలో 9వ తేదీ ఆదివారం రోజున శ్రీ స్వామి వారు చాతుర్మాస్య దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తకోటిని ఉద్ధేశించి ప్రసంగించారు. అన్నింటికి మూలం వేదమే. ఆయా కాలాలలో ఎందరో మహానుభావులు ఈ నేలపై జన్మించారు. [...]